చిత్తూరు జిల్లా. పుంగనూరు మండలం. బండ్లపల్లి సచివాలయ పరిధిలో సోమవారం ఉదయం పంపిణీ చేయవలసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ పాల్పడి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సొమ్మును స్వాహా చేసిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు. మండల అధికారుల ఫిర్యాదు మేరకు పంచాయతీ కార్యదర్శిని అదుపులో తీసుకొని విచారిస్తున్న పోలీసులు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన సోమవారం సాయంత్రం ఐదు గంటలకు వెలుగులో వచ్చింది.