చందూర్ లో ఉన్న శివాజీ బీడీ సెంటర్ ను మార్చాలనే ఆలోచనను యజమాన్యం వెంటనే ఉపసంహరించుకో వాలని తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. గత 14 సంవత్సరాల నుండి మహిళా ప్యాకర్స్ పనిచేస్తున్నారని బీడీ కంపెనీని మార్చితే ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆమె తెలిపారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లేబర్ కార్యాలయంలో చందూర్లోని శివాజీ బీడీ కంపెనీ వేరే చోటికి మార్చడానికి యాజమాన్యం విరమించుకోవాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు.