కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక సమస్యలకు, రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఓ వైపు ప్రతి రోజు ట్రాఫిక్ సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురిఅవుతుంటే.. మరో వైపు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలంగాణ చౌక్ లోని జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్ వైపు వెళ్లే బస్టాండ్ ఎదుట ఓ భారీ గుంత పడింది. ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంతతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు రాత్రి సమయంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ చౌక్ నుండి బస్టాండ్ వెళ్లే వాహనలతో ట్రాఫిక్ జామ్, జిక్ జాక్ లతో ప్రతి రోజు పదుల సంఖ్య రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.