వరద బాధితులకు అండగా ఉంటానని అధైర్య పడదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు భరోసానిచ్చారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఉమ్మడి జిల్లాలోని పలు వరద ప్రాంతాలను ఎంపీ రఘునందన్ రావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ వరద బాధితులకు కావాల్సిన ఏర్పాట్లు అందించాలని ఆదేశించారు. ఘనపూర్ మండలం దుప్ సింగ్ తండా వాసులు వరద నీటిలో చిక్కకోగా వారితో మాట్లాడి ధైర్యం నింపారు. కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తానని బయటకు రావద్దని సూచించారు.