నగర శివారులోని మాధవ నగర్ సాయిబాబా ఆలయం సమీపంలో ఒకరు అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఇటీవల కురిసిన వర్షాలతో రైల్వే గేట్ సమీపంలో రోడ్డు గుంతల మయంగా మారింది. ఈ క్రమంలో శనివారం ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న డ్రెయినేజీ లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న వ్యక్తులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.