లారీ బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ను బుధవారం రోజు ఉదయం వరంగల్ నగరంలోని ఎంజిఎం ఆసుపత్రికి తీసుకువచ్చిన 108 సిబ్బంది వివరాలలోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం జాతీయ రహదారి మల్లంపల్లి స్టేజి సమీపంలో భూపాలపల్లి నుంచి గోదావరిఖనికి బొగ్గును తీసుకెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది 108 వాహనం చేరుకొని డ్రైవర్ ను భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు వైద్యులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.