గ్రూప్-1 పోస్టులు రూ.3 కోట్లకు అమ్ముకున్నారంటూ మాజీమంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఓయూ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. కేటీఆర్ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.