జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటపొలాలు నీట మునిగాయి. సాలూర మండలం, ఖాజాపూర్‌లో రైతులు పండించిన సోయా, వరి పంటలు భారీ వర్షాల ధాటికి పూర్తిగా నీట మునిగాయి. తమ కళ్ల ముందే పంటలు నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోక పోతే ఆత్మహత్యలే శరణ్యం అని పేర్కొంటున్నారు.