నాగాయలంక మండలం పేదగౌడపాలెంలో సాగునీరు అందక వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు లేక ఆయిల్ ఇంజన్లు పెట్టి తోడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. దివిసీమలో ఇరిగేషన్ అధికారులు వంతుల వారీగా నీరు ఇస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాగునీరు అందించాలని కోరారు.