దేవరపల్లి మండలం కృష్ణం పాలెం జాతీయ రహదారి వంతెన పై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కంటైనర్, టాటా మ్యాజిక్ వాహనాలు ఢీకొన్న ఘటనలో మ్యాజిక్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. వారు విశాఖ నుంచి నెల్లూరు వెళ్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.