బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో రేషన్ డీలర్ సిహెచ్ కుమారస్వామి రెడ్డిపై గురువారం 6ఏ కేసు నమోదైంది. షాపులో నిత్యావసర సరుకుల నిల్వల్లో తేడాలున్నాయని, బియ్యం 5.3 క్వింటాళ్లు తక్కువగా, పంచదార 24 ప్యాకెట్లు ఎక్కువగా ఉన్నాయని గ్రామ విఆర్ఎ నెహ్రూ తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.