ప్రకాశం జిల్లా కంభం, అర్ధవీడు మండలాలలోని పలు ఎరువుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామంలో లైసెన్సు లేకుండా నిర్వహిస్తున్న ఎరువుల దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇక కంభం పట్టణంలోని మన గ్రోమోర్ సెంటర్ లో సరైన పత్రాలు లేని 4.5 టన్నుల ఎరువుల అమ్మకాలను అధికారులు నిలిపివేశారు. కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎరువుల దుకాణదారులను అధికారులు హెచ్చరిస్తున్నారు.