క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక ద్రుఢత్వం లభిస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన మూడపల్లి ప్రీమియం లీగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందనీ తెలిపారు...మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు..గతంలో విద్యార్థి దశలో ఉన్న సమయంలో కోర్టు లైన్ పోసే వాడినని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.