జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం జక్కాపూర్ అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో గుర్తు తెలియని అమ్మాయి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. సుమారు 14-18 ఏళ్ల వయస్సు ఉన్నట్లు చెప్పారు. మెరూన్ రంగు లెగ్గిన్, ఆకుపచ్చ రంగు టాప్, బూడిద రంగు స్కార్పు, కాళ్లకు పట్టీలు, కుడి కాలుకు దారం ఉన్నట్లు చెప్పారు. ఎవరైనా గుర్తిస్తే నిజాంసాగర్ మండల పోలీస్ స్టేషన్ 8712686172 కు సమాచారం ఇవ్వాలని కోరారు.