డెంగ్యూతో మరణించిన మహేష్, శ్రావణ్ మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే.. అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఇద్దరు యువకులు డెంగ్యూతో మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాలను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యం వల్లే గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందని, గ్రామపంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవని, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు. చెత్త సేకరణ చేసే దిక్కులేదన్నారు. ముఖ్యమంత్రి ఒకనాడు అయినా పారిశుధ్యంపై సమీక్ష చేయలేదన్నారు