కొయ్యూరు మండలంలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేయడం జరుగుతుందని ఏవో ఐ.భాను ప్రియాంక మంగళవారం తెలిపారు. ఎరువులు కావాల్సిన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. రైతుల అవసరం మేరకు రైతు సేవా కేంద్రాల ఇన్‌ఛార్జిలు ఇండెంట్ పెట్టి ఎరువులు తెప్పించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం చీడిపాలెం రైతు సేవా కేంద్రంలో యూరియా అందుబాటులో ఉందన్నారు. ప్రైవేట్ షాపుల్లో అధిక ధరలకు కొని మోసపోవద్దన్నారు.