మహబూబ్ నగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ శనివారం జరిగింది. క్రిమినల్, యాక్సిడెంట్, సివిల్ తగాదా, ఆస్తి విభజన, కుటుంబ సమస్యలు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, వైవాహిక జీవితం తదితర కేసుల్లో ఇరు వర్గాల వారు రాజీ చేసుకోవాలని సెకండ్ ఏడీజే శారద సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం అందుతుందన్నారు. జడ్జి ఇందిరా, ఏఎస్పీ, డీఎస్పీ, అడ్వకేట్లు పాల్గొన్నారు.