ధర్మవరం మండలం రేగాటిపల్లి కి చెందిన పుల్లారెడ్డి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుల్లారెడ్డి గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఉండేవాడని ఈరోజు మనస్థాపంతో పురుగుల మందు తాగాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.