ఒక ఉద్యోగి ఒక మొక్క, ఏక్ పెడ్ మాకే నామ్ (తల్లి పేరున ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ గ్రామ శివారులోని సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ మొక్కలు నాటారు. అదే విధంగా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో, భరోసా సెంటర్ ఆవరణలో, సఖి సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. నేటి మొక్కలే రేపటి వృక్షాలు అని, సమతుల్యమైన ఆహ్లాదకరమైన వాతావరణం గురించి మొక్కలు చాలా ముఖ్యమన్నారు. భావితరాలను దృష్టిలో పెట్టుకొని మొక్కలు నాటాలన్నారు. పరిశుభ్రత, పచ్చదనము, ఆహ్లాదకరమైన వాతావర