గణేష్ మండప నిర్వాహకులు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి తీసుకోవాలని ఎస్సై శ్రీధర్ రెడ్డి సూచించారు. శనివారం జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి మండలకేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో మేడిపల్లి, భీమారం మండలాల్లోని అన్ని గ్రామాల యువకులతో సమావేశం ఏర్పాటు చేశారు. మండపాలు రోడ్డుపై ఏర్పాటు చేయవద్దని, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా ప్రతిరోజు మండపం వద్ద ఉండాలన్నారు.