అల్లూరు మండలంలోని నార్త్ మోపూరులో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గురువారం రాత్రి ప్రత్యేక పుష్ప అలంకరణ, విద్యుత్ దీప అలంకరణ నడుమ స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది.