అర్హులైన అందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుతాయని,ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి హామీ ఇచ్చారు.ఈతేరు గ్రామంలో సోమవారం ఉదయం ఆయన స్వయంగా పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా పింఛన్లు సక్రమంగా అందుతున్నదీ,లేనిదీ ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ సాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరు సూచించారు.వికలాంగుల పింఛన్లలో కోత ఉండదని కూడా కలెక్టర్ స్పష్టం చేశారు.