విశాఖపట్నం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శనివారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 98వ వార్డు కార్పొరేటర్ శ్రీ పీవీ నరసింహం ఆయనతో పాటు స్వామివారి దర్శనంలోపాల్గొన్నారు. వీరికి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సింగం రాధ , సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు పర్యవేక్షణాధికారి త్రిమూర్తులు అర్చకులు నాదస్వర వాద్యాలతో, వేదమంత్రోచ్చారణల తో స్వాగతం పలికారు. ముందుగా మేయర్, ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని అనంతరం స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.