ఎమ్మిగనూరు : 'సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..ఈ నెల 13న కర్నూలులోని కేకే భవన్లో జరిగే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, తాలూకా అధ్యక్షుడు రాముడు కోరారు. శుక్రవారం నందవరంలో ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు పని ఒత్తిడి తగ్గించి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఆశా వర్కర్లను సెకండ్ గ్రేడ్ ఏఎన్ఎంలుగా గుర్తించాలని కోరారు.