ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ, సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని పక్కదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఆరోపించారు. గుంటూరులో ఎమ్మెల్యే నసీర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేస్తున్న టీడీపీ నాయకులపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు నాయుడు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి పెద్దఎత్తున వెళ్తున్నాయని నసీర్ తెలిపారు.