వినాయక నిమజ్జన కార్యక్రమం ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ శనివారం ఓ ప్రకటనలో సూచించారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 2,750 పైచిలుకు గణపతి విగ్రహాల ప్రతిష్టాపన జరిగిందని తెలిపారు. వినాయక నిమజ్జన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు, ప్రతి వినాయక మండపాన్ని జియో టాకింగ్ చేయడం జరిగిందని తెలిపారు. మరియు గణేష్ నిమజ్జనం జరిగే రూట్ మ్యాప్ లో సీసీ కెమెరాల నిఘాలో ఉంచడం జరిగిందన్నారు. ప్రజలందరూ కలిసిమెలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రానున్న పండగలను ప్రశాంతమ