ఎమ్మిగనూరు : పైప్ లైన్ లీకేజీతో తాగునీరు కలుషితం..గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ పరిధి ధనబండ వీధిలో తాగునీరు కలుషితంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. డ్రైనేజీ కాలువలో మంచినీటి పైపు లీకేజీ కారణంగా నీరు కలుషితం కావడంతో దుర్వాసన వస్తోందని, సర్పంచ్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం లేదని తెలిపారు. దోమలు ఎక్కువై రోగాలు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.