బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన దూధాని జగిర్ సింగ్( 36 )అనే వ్యక్తిపై బుధవారం ఇంటి గోడ కూలి మృతి చెందాడని బిక్కనూర్ ఎస్ఐ. ఆంజనేయులు తెలిపారు. ఎస్ఐ. మాట్లాడుతూ... వినాయక చవితి పండుగ సమయంలో కురిసిన భారీ వర్షాలకు అతను ఉంటున్న ఇల్లు గోడలు ప్రమాదకరంగా మార్యాని, అట్టి గోడలు సగం కూలినవి, జగిర్ సింగ్ తన ఇంటి వెనకాల గల బాత్రూంకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు అట్టి సగం కూలిన గోడ అతనిపై పడి మరణించిడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.