Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
కావలి పురపాలక సంఘం పరిధి మద్దూరుపాడులోని టిడ్కో గృహాలలో 600 ఇళ్లులు ఖాళీగా ఉన్నాయని, అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ శనివారం తెలియజేశారు. గతంలో గృహాలను కేటాయించిన వారిలో కొందరు అనర్హులు కావడం, కొందరికి బ్యాంకు రుణాలు రాకపోవటం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. గతంలో ఎక్కడా ఇల్లు, ఇళ్ల స్థలాలు లేని వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన తెలియజేశారు.