ఎమ్మిగనూరు : నందవరం జిల్లా పరిషత్ హైస్కూల్ను తనిఖీ చెసిన జెడ్పీ సీఈవో..జెడ్పీ సీఈవో నాసర రెడ్డి శనివారం నందవరం జిల్లా పరిషత్ హైస్కూల్ను తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు, నాడు-నేడు నిర్మాణాలను పరిశీలించి, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల త్రాగునీటి పైప్ లైనను కూడా సమీక్షించారు. ఉపాధ్యాయులు ప్రహరీ, గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు.