అరకు ప్రాంతంలోని గిరిజన యువతకు బరిస్టా కాఫీ తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం రాత్రి తెలిపారు. ఈనెల 23నుంచి 27వరకు అరకు వైటీసీలో శిక్షణ ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కాఫీ బోర్డు ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు జరిపి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు పోస్టర్ను అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తో కలిసి ఆవిష్కరించారు.