మద్యం తాగకని మందలించిన పాపానికి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ PS పరిధి కిస్మత్పూర్లో జరిగింది. పోలీసుల వివరాలిలా.. మద్యం తాగకు మంచిదికాదని భార్య అరుణను భర్త శేఖర్ కట్టడి చేశాడు. అతడులేనప్పుడు మద్యంలో ఎలుకల మందు కలుపుకొని తాగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది. గుర్తించిన కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.