జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయ భవనాలపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు, ఉపాధి హామీ కూలీలచే పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగింపు, ఈజీఎస్ కాంపోనెంట్ మెటీరియల్ పనుల పురోగతిపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, హౌసింగ్ ఏ.ఈలు, ఏపీఓ లు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.