భూ సంబంధిత అర్జీదారులు, ఫిర్యాదుదారుల అర్జీల పట్ల భాధ్యతాయుతంగా, త్వరితగతిన స్పందించగలిగినపుడే.. 100% రెవెన్యూ సమస్యలను పరిష్కరించగలమని జిల్లా ఇంఛార్జి కలెక్టర్, జేసీ అదితి సింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సభాభవన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల పెండెన్సీపై జిల్లా ఇంచార్జి కలెక్టర్, జేసీ అదితి సింగ్.. డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, చిన్నయ్య, సర్వే ల్యాండ్స్ ఏడీ మురళీ కృష్ణ లతో కలిసి.. సీఎంవో కార్యాలయం నుండి అందిన కాల్స్ మేరకు సమీక్షించారు.