వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని గురువారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా అర్చకులు ఆలయ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తర్వాత అద్దాల మండపంలో వారిని అర్చకులు ఆశీర్వదించగా,ఈవో రాధా బాయి లడ్డూ ప్రసాదం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాలు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రజాప్రతినిధులందరినీ అప్రమత్తం చేశారన్నారు. వరదల నేపథ్యంలో ఎవరికి ఏమి కాకుండా చూడాలని దేవుని కోరుకున్నట్టు తెలిపారు