పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ GHMC అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా లైటింగ్, భారీ విగ్రహాల కోసం క్రేన్, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చారు. అనంతరం భగత్‌గల్లీ మసీదులో పిచ్చి మొక్కలు తొలగించాలంటూ ఎంటమాలజీ అధికారిని ఆదేశించారు.