మహిళల విషయంలో కీచక పార్టీ వైసీపీ అయితే రక్షక పార్టీ టిడిపి అని చీరాల నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శనివారం చీరాలలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేంద్రనాథ్ గత ఐదేళ్ల పాలనలో వైసిపి మహిళల పట్ల ఎంతో అనుచితంగా ప్రవర్తించిందన్నారు.అందుకు భిన్నమైన పాలన ఇప్పుడు టిడిపి ప్రభుత్వం సాగిస్తోందని చెప్పారు.కాసేపు కోలాటం ఆడి ఆయన అందరినీ అలరించారు.