ఎమ్మిగనూరు ఆర్ఎస్ఆర్ బార్ & రెస్టారెంట్లో అగ్నిప్రమాదం ఎమ్మిగనూరులోని అన్నమయ్య సర్కిల్లో ఉన్న ఆర్ఎస్ఆర్ బార్ & రెస్టారెంట్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించి, మంటలు చెలరేగాయి. రెస్టారెంట్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అర్పివేశారు. రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని యజమానులు తెలిపారు.