వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి లో ప్రమాదవశాత్తు ట్రాలీ ఆటో బోల్తా పడి నలుగురికి తీవ్ర గాయాలు.వరంగల్ నుంచి పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి సిమెంట్ బస్తాలతో ట్రాలీ ఆటో వెళ్తుంది. సిమెంట్ బస్తాలను దించడానికి ఇల్లందకు చెందిన నలుగురు హమాలీలు ఉప్పరపల్లి క్రాస్ వద్ద ఆటో ఎక్కారు.ఈ క్రమంలో ఆటో టైర్ పేలి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.