రాయదుర్గంలోని మున్సిపల్ కార్యాలయంలో పురపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. శనివారం ఉదయం ఛైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. పట్టణంలోని డివైడర్లలో ఉన్న ఎండిన మొక్కలు తొలగించి, నూతనంగా మొక్కలు నాటేందుకు, పలు వార్డుల్లో కల్వర్టులు, తాగునీటి పైప్ లైన్ల పనులపై ఆమోదం కోసం చర్చించారు. కమిషనర్ దివాకర్ రెడ్డి, డీఈ సురేశ్, వైస్ ఛైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.