ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కొయ్యూరు మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ బడుగు రమేశ్ అధికారులకు సూచించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించాలని, సర్పంచ్, ఎంపీటీసీలను ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు.