అక్రమ బెల్టు షాపులు అరికట్టేవరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి అధ్యక్షతన జరిగింది. నరసింహామూర్తి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న గీత కార్మికుల భవిష్యత ఆగమ్య గోచరంగా మారుతోందన్నారు. రాజకీయ పార్టీలు కల్లుగీత కార్మికులను కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూస్తున్నారుఅని అన్నారు.