వేటపాలెం- చీరాల రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల పక్కన గురువారం సాయంత్రం ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండగా గ్యాంగ్ మెన్ గుర్తించి చీరాల రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.నిద్రమత్తులో భోగి నుండి జారిపడి అతను మరణించి ఉంటాడని భావిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తించాల్సి ఉందన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.