బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల కేంద్రములో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో తెలంగాణ ఉద్యమ కారుణి వీర వనిత చిట్యాల ఐలమ్మ 130 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ వద్ద మొదటగా ఐలమ్మ చిత్రపటానికి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి పూలమాలు వేసి నీవాళ్లు అర్పించారు. తెలంగాణ భూపోరాటానికి నాంది పలికిన వీర మాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి అని గుర్తు చేసుకొన్నారు. ఐలమ్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారు. వీరనారి ఐలమ్మకి జై అంటూ నినాదాలు చేస్తూ ఘనముగా నివాళ్లు అర్పించారు.