ఇబ్రహీంపట్నంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీలో సూర్య సాయి నగర్ కాలనీ సర్వేనంబర్ 201లో 482 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని స్థానికులు హైడ్రకు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన అధికారులు అక్రమ కట్టడాలు వెలసినట్లు గుర్తించి కూల్చివేశారు. ఆ స్థలం విలువ దాదాపు రూ.2 కోట్లు వరకు ఉన్నట్లు అంచనా వేశారు. ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.