పలమనేరు: గంగమ్మ తోపు నందు పెట్ షాప్ నిర్వహిస్తున్న మంజునాథ్ గురువారం తెలిపిన సమాచారం మేరకు. మా పెట్ షాప్ నందు వివిధ రకాల కుక్కపిల్లలు పావురాలు కుందేలు అన్ని అమ్ముతుంటాము. ఈ నేపథ్యంలో టైఫామ్ అనే జాతికి చెందిన కుక్కపిల్ల రెండు రోజుల ముందు దొంగతనం జరిగిందన్నారు. చుట్టుపక్కల విచారించిన ఎవరైనా తీసుకెళ్లి మళ్ళీ తెచ్చిస్తారని ఆశతో ఉన్న, ఇంతవరకు దొరకలేదు అందువలన పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పై ఫోటోలో ఉన్న కుక్కపిల్ల ఎవరికైనా కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.