ధర్మవరం చిగిచెర్ల రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని ధర్మవరం రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసినవారు ధర్మవరం రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.