సీఎం చంద్రబాబులో ఎలాంటి మార్పు లేదని,నాడు నేడు కూడా ప్రజలపై విద్యుత్ చార్జీల భారాలు మోపుతూనే ఉన్నారని పలువురు వామపక్ష నేతలు విమర్శించారు.2000 లోవిద్యుత్ చార్జీల పెంపుదలను నిరసిస్తూ వామపక్షాలు ఉద్యమించిన సమయంలో బషీర్బాగులో పోలీసులు జరిపిన కాల్పులలో మృతి చెందిన అమరవీరులకు వారు గురువారం నివాళులర్పించారు.అధికారంలో లేనప్పుడు ఒకలా, సీఎంగా ఉంటే మరోలా వ్యవహరించడం చంద్రబాబుకు అలవాటన్నారు. ఇప్పుడు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించే పనిలో సీఎం ఉన్నాడని వారు ఎద్దేవా చేశారు