ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆలయ కమిటీ అధికారులు పురోహితులు ఆదివారం స్వామివారి ఆలయతలుపులను మూసివేశారు.చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా స్వామివారి ఆలయంలోకిఎలాంటి గ్రహణ దోషాలు రాకుండా ఆలయ కమిటీ అధికారులు సిబ్బంది తలుపులు మూసివేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు చంద్ర గ్రహణం పూర్తి అయిన తర్వాత ఆలయాన్ని శుభ్రపరచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం 9 గంటల సమయంలో భక్తులకు పునర్దర్శనకార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.