మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంగళవారం ఉదయం 11:00 లకు వచ్చిన మంత్రుల కాన్వాయ్ ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి అడ్డుకున్నారు..యూరియా కొరతపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. తక్షణమే పోలీసులు జోక్యం చేసుకుని కాన్వాయ్ ను ముందుకు పంపించారు.. మంత్రుల కాన్వాయ్ ను బి ఆర్ ఎస్ నాయకులు అడ్డుకోవడంతో జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది..